
హైదరాబాద్, వెలుగు: 14 నుంచి 22 వరకూ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకూ జరగనున్నా యని చెప్పారు. ఈ పరీక్షలకు 71,681 మంది అటెండ్ కానున్నా రని, వీరిలో బాయ్స్ 41,526 మంది, బాలికలు 30,255 మంది ఉన్నారని వివరించారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 259 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలను
పకడ్బందీగా నిర్వహించేందుకు 50 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, 2800 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్టు చెప్పారు.