30 ఏండ్ల తర్వాత కలిసిన టెన్త్ బ్యాచ్ విద్యార్థులు

30 ఏండ్ల తర్వాత కలిసిన టెన్త్ బ్యాచ్ విద్యార్థులు

ఎల్ బీనగర్, వెలుగు: యాచారం మండలం చిన్నతుండ్ల జడ్పీ స్కూల్ 1993– -94 బ్యాచ్ టెన్త్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కర్మన్ ఘాట్ లోని సితార హోటల్లో ఘనంగా జరిగింది. చదువు చెప్పిన గురువులకు పూలమాలల వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. వారి యోగ క్షేమాలను తెలుసుకుని ఆప్యాయంగా పలకరించారు.

30 ఏండ్ల అనంతరం వారంతా ఒకే వేదికపై కలవడం,  టెన్త్ నాటి రోజులను మరోసారి గుర్తు చేసుకుని సంతోషం వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు జక్కుల వెంకటేశ్, అంకని ఈశ్వర్, బి. వెంకటేశ్వర్లు, వై ఆంజనేయులు, ఎస్ రాజేశ్, ఎ. రాజిరెడ్డి, యశోద, ప్రతిభ, శ్రీమన్నారాయణ, సంజీవ తదితరులు పాల్గొన్నారు.