గేమ్స్ ఆడొద్దన్నందుకు టెన్త్​ స్టూడెంట్ సూసైడ్‌‌‌‌

గేమ్స్ ఆడొద్దన్నందుకు టెన్త్​ స్టూడెంట్ సూసైడ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: సెల్ ఫోన్​లో గేమ్స్ ఆడొద్దంటూ తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని అమాన్ నగర్ బస్తీకి చెందిన ఇలియాస్ షరీఫ్ కొడుకు ఇసాక్ షరీఫ్ (16) టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. గురువారం సాయంత్రం స్కూల్ నుంచి రాగానే తండ్రి మొబైల్ ఫోన్ తీసుకుని గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. చదువుకోకుండా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్న కొడుకును మందలించిన ఇలియాస్ షరీఫ్​ఫోన్ లాక్కుని, భార్యతో కలిసి మార్కెట్ కు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి ఇసాక్ ​బెడ్రూంలో చున్నీతో ఉరేసుకుని శవమై కనిపించాడు. ఇలియాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిం చారు. డెడ్ బాడీని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.