వర్డల్కప్ ముందు భారత్కి బిగ్ షాక్.. గాయంతో ఆఫ్ఘన్‌తో వన్డే సిరీస్‌ నుంచి హార్ధిక్ ఔట్

వర్డల్కప్ ముందు భారత్కి బిగ్ షాక్.. గాయంతో ఆఫ్ఘన్‌తో వన్డే సిరీస్‌ నుంచి హార్ధిక్ ఔట్

Hardik Pandya Ruled Out: ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ స్టార్ట్ కావడానికి ముందే టీమిండియాకు ఒక మైండ్ బ్లాక్ షాక్ తగిలింది. నిన్ననే ఫిట్‌నెస్ సాధించి టీమ్‌లోకి వస్తున్నాడనుకున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు మళ్లీ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడనే బ్యాడ్ న్యూస్ బయటకొచ్చింది. జూన్ 13 నుంచి ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు పాండ్యా కాలు బెణకడంతో (Leg Sprain) సిరీస్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. కాగా దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్ కోసం భారత్ సన్నాహాలను ఈ సిరీస్‌తోనే ప్రారంభించనుంది. 

దెబ్బతిన్న భారత జట్టు బ్యాలెన్స్: 
వన్డే సిరీస్‌కు రెడీ అవుతున్న టైమ్‌లో హార్దిక్ పాండ్యా దూరం కావడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.. వైట్ బాల్ క్రికెట్‌లో మనోడు ఎంత ఇన్‌ఫ్లూయెన్షియల్ ప్లేయరో అందరికీ తెలిసిందే. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ జట్టుకు పక్కా బ్యాలెన్స్ తెచ్చే ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రెజర్ సిట్యుయేషన్స్‌లో చాలా అవసరం పడతాడు. ఇప్పుడు పాండ్యా లేకపోవడంతో టీమిండియా మరో ఆల్ రౌండర్ ని వెతికే పనిలో పడింది. 

ఆల్‌రౌండ్ ఆప్షన్లపై మేనేజ్‌మెంట్ కసరత్తు: 
హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ జట్టు బ్యాలెన్స్‌ను ఎలా సెట్ చేయాలనే దానిపై రీఅసెస్మెంట్ చేయక తప్పడం లేదు.. పాండ్యా ప్లేస్‌ను రీప్లేస్ చేసే ఇతర ఆల్‌రౌండర్ ఆప్షన్లను పరిశీలించాల్సిన పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో భారత్‌కు మరికొన్ని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ టూర్లు ఉన్నాయి కాబట్టి.. బీసీసీఐ అతని రికవరీ ప్రాసెస్‌ను చానా క్లోజ్‌గా మానిటర్ చేయనుంది.

పాండ్యా కోసం వెయిటింగ్:  
ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో మంచి మొమెంటం అందుకోవాలని చూస్తున్న భారత్‌కు.. హార్దిక్ పాండ్యా లాంటి క్యాలిబర్ ఉన్న ప్లేయర్ దూరం కావడం మస్తు నిరాశ కలిగించే విషయమే.. మనోడు త్వరగా కోలుకుని.. మళ్లీ పాత ఫామ్‌తో గ్రౌండ్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలని క్రికెట్ లవర్స్ ఆశగా వెయిట్ చేస్తున్నారు.