ఆగస్టులో పదో తరగతి లాంగ్ మెమోలు

ఆగస్టులో పదో తరగతి లాంగ్ మెమోలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల పదో తరగతి పూర్తయిన స్టూడెంట్లకు లాంగ్ మెమోలు ఆగస్టులో అందనున్నాయి. దీనికి సంబంధిన ఏర్పాట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం మొదలుపెట్టింది. 2020–21 విద్యాసంవత్సరంలో మొత్తం 5,21,647 మంది స్టూడెంట్లు ఫీజు కట్టగా, కరోనా తీవ్రత మేరకు వారందరినీ ప్రభుత్వం పాస్ చేసింది. నెల రోజుల కింద స్టూడెంట్లకు జీపీఏ పాయింట్లు కూడా అలాట్ చేశారు. ఈ ఏడాది బోర్డు ఎగ్జామ్స్​నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో, హాల్ టికెట్లనూ స్టూడెంట్లకు అలాట్ చేయలేదు. దీంతో స్కూళ్లనుంచి హెడ్మాస్టర్లు ఎస్ఎస్సీ బోర్డుకు పంపించే వివరాల్లో చిన్నచిన్నతప్పులు కన్పిస్తున్నాయి. అయితే వీటిని సరిచేసుకునే అవకాశం ఎగ్జామినేషన్ బోర్డు ఇచ్చింది. ప్రస్తుతం ఇంటర్​తో పాటు ఇతర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం స్టూడెంట్లకు ఇబ్బంది కాకుండా ఇంటర్నెట్ మెమోలను పొందేందుకు అవకాశముంది. ప్రింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసిన మెమోలపై ఆ స్కూల్ హెడ్మాస్టర్​సంతకం చేసి ఇస్తే, దాని ఆధారంగా ఇంటర్, తదితర కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఈ మెమోల్లో స్టూడెంట్ల పేరు, పుట్టినతేదీ, తండ్రి పేరు, ఇతర అంశాల్లో ఏమైనా తప్పులుంటే  వెంటనే గుర్తించి హెడ్మాస్టర్లకు తెలుపాలని అధికారులు స్టూడెంట్లు, పేరెంట్లకు సూచిస్తున్నారు. తద్వారా సరిచేసిన ఇంటర్నెట్ మెమోల ఆధారంగానే ఒరిజినల్ లాంగ్ మెమోలు రానున్నాయి. ఆగస్టు నెలలో స్టూడెండ్లకు ఒరిజినల్ మెమోలు అందిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.