కౌలాలంపూర్: ఇండియా యంగ్ షట్లర్లు ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్.. మలేసియా మాస్టర్స్ లో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన విమెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌లో ట్రీసా–గాయత్రి 21–14, 21–10తో హుయాంగ్ యు సన్–లియాంగ్ టింగ్ యు (చైనీస్‌తైపీ)పై గెలిచారు. మెన్స్ సింగిల్స్‌లో నలుగురు బరిలోకి దిగినా ఒక్కరు కూడా మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపోయారు.
సతీశ్ కుమార్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడగా, ఆయూష్ షెట్టి కూడా నిరాశపర్చాడు. శంకర్ సుబ్రమణ్యం 12–21,17–21తో రుస్తావిటో (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నాడు. విమెన్స్‌లో తన్యా హేమంత్ 21–23, 8–21తో లిన్ సిహ్ యున్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడింది. డబుల్స్‌లో పాలక్ ఆరోరా–ఉన్నతి హుడా 10–21, 5–21తో సు యిన్–లిన్ జి యున్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడారు. మరోవైపు బీడబ్ల్యూఎఫ్ మెన్స్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరింది.
