PFI ట్రైనింగ్ పేరుతో తీవ్రవాద కార్యకలాపాలు?!

PFI ట్రైనింగ్ పేరుతో  తీవ్రవాద కార్యకలాపాలు?!

నిజామాబాద్ లో పీఎఫ్ఐ సంస్థ ట్రైనింగ్ పేరుతో తీవ్రవాద కార్యకలాపాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 28 మందిని గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోషల్ ఆర్గనైజేషన్ పేరుతో  పీఎఫ్ఐ 8 సంస్ధలు నడుపుతున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దాని ప్రకారం.. సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ విమెన్ ఫ్రంట్ల పేరిట ఓ వర్గానికి చెందిన యువతకు తీవ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్టోన్ పెల్టింగ్, కత్తులతో దాడికి సంబంధించిన శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. యువకులను రెచ్చగొట్టడం, ఇతర మతాలపై అనుచిత వ్యాఖ్యలు  చేయడం వంటివి పీఎఫ్ఐ చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. సోషల్ వర్క్ పేరుతో ఫండ్స్ వసూలు చేసి క్యాడర్ ను పెంచుకుని..డివిజన్, రీజినల్, స్టేట్ స్థాయిలో కేడర్తో తరుచూ మీటింగ్స్ పెడుతున్నట్లు వివరించారు. స్కూల్ నుంచి కాలేజీ దాకా వివిధ స్థాయుల్లో యువకులను ఆకర్షించి రిక్రూట్ చేసుకునేందుకు పీఎఫ్ఐ పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు.