
పుల్వామా: జమ్ము కశ్మీర్, పుల్వామాలో భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఓ జవాన్ అమరుడవ్వగా.. ఓ తీవ్రవాది హతమయ్యాడు. నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. ఉదయం టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో పుల్వామాలోని హంజిన్ రాజ్‌పొరా గ్రామంలో కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి భద్రతా బలగాలు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుండగా.. టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో సెక్యూరిటీ ఫోర్సెస్ ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మరింత సమాచారం రావాల్సి ఉంది.