డమాస్కస్: యూఎస్ ఆర్మీ సోల్జర్లు సినిమా ఫక్కీలో దాడి చేసి సిరియాలో ఇస్లామిక్ స్టేట్ లీడర్‌ను పట్టుకున్నారు. గురువారం ఉదయం సోల్జర్లు రెండు హెలికాప్టర్లలో వెళ్లి అలెప్పో ప్రాంతంలో టెర్రరిస్టు తలదాచుకున్న ఇంటిపై నేరుగా దిగి, అతన్ని లాక్కొని వచ్చేశారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. ఈ ఆపరేషన్‌ను 7 నిమిషాల్లో ముగించినట్లు చెప్పింది. ఆ టెర్రరిస్ట్ ఇస్లామిక్ స్టేట్ అగ్ర నేతలలో ఒకడని, బాంబుల తయారీలో ఎక్స్పర్ట్ అని మాత్రమే చెప్పింది. అయితే, పట్టుబడింది ఐసిస్ టెర్రరిస్ట్ సంస్థ కమాండర్ హనీ అహ్మద్ అల్-కుర్దియేనని అని యూఎస్ మీడియా తెలిపింది.
