పోలీస్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదుల దాడి

పోలీస్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదుల దాడి

ఆఫ్ఘనిస్తాన్‌లోని పోలీసు శిక్షణా స్థావరంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది పోలీసులు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడినట్లు సమాచారం. బాగ్లాన్ ప్రావిస్స్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రంపై తాలిబన్లు బాంబులతో ఎటాక్ చేశారు. శిక్షణ కేంద్రంలోని ఒక పోలీసు సహకారంతోనే ఉగ్రవాదులు ఈ దాడులు చేసి ఉంటారని స్థానిక ప్రభుత్వ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బాగ్లాన్ ప్రావిన్షియల్ రాజధాని పులి ఖుమ్రీ శివార్లలో సోమవారం జరిగిన ఈ దాడికి ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే తాలిబన్లు ఈ ప్రావిన్స్‌లో బలమైన ఉనికిని కలిగి ఉన్నారు. తాలిబన్లు ఆఫ్ఘన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని తరచుగా దాడులకు పాల్పడుతుంటారు.

యూఎస్ మరియు తాలిబన్లు కాల్పుల విరమణపై చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చలు సఫలం అయితే దాదాపు 13,000 మంది అమెరికన్ సైనికులు తమ దేశానికి వెళ్లే అవకాశముంటుంది.

For More News..

ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా 7,423 బాంబుల దాడి

వైరల్ వీడియో: జింకను గన్‌తో కాల్చి.. కత్తితో గొంతు కోసిన వ్యక్తి

43.5 కోట్ల మంది డేటా అమ్మేసుకున్న కంపెనీ