ఆర్మీ ట్రక్కుపై ఉగ్ర దాడి .. ఐదుగురు సోల్జర్ల సజీవదహనం

ఆర్మీ ట్రక్కుపై ఉగ్ర దాడి ..  ఐదుగురు సోల్జర్ల సజీవదహనం
  • ఆర్మీ ట్రక్కుపై ఉగ్ర దాడి 
  • ఐదుగురు సోల్జర్ల సజీవదహనం
  • భారీ వర్షంలో కాల్పులకు దిగిన టెర్రరిస్టులు
  • తర్వాత గ్రెనేడ్ల దాడి.. కాలిపోయిన వెహికల్
  • జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని ఫూంఛ్​​లో ఘటన

జమ్మూ/న్యూఢిల్లీ: మిలిటరీ వెహికలే లక్ష్యంగా టెర్రరిస్టులు విరుచుకుపడ్డారు. భారీ వర్షం పడుతుండటం, విజిబులిటీ తక్కువగా ఉండటాన్ని అదునుగా చేసుకుని సైనికులు ఉన్న ట్రక్కుపై కాల్పులకు దిగారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని ఫూంఛ్​లో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు సోల్జర్లు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్కు పూర్తిగా కాలిపోయింది. టెర్రరిస్టులు గ్రెనేడ్లతో దాడి చేయడంతోనే మంటలు చెలరేగినట్లుగా సైన్యం తెలిపింది. తొలుత పిడుగు పడి ట్రక్కు కాలిపోయిందని వార్తలు రాగా.. టెర్రర్ దాడి జరిగినట్లుగా తర్వాత వెల్లడైంది. ఆర్మీ వెహికల్ కాలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

‘‘గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాజౌరి సెక్టార్‌‌‌‌‌‌‌‌లోని ఫూంచ్‌‌‌‌లో భింబెర్ గాలి ఏరియాలో ఆర్మీ ట్రక్కు వెళ్తుండగా టెర్రరిరస్టులు కాల్పులు జరిపారు. తర్వాత చేసిన గ్రనేడ్​ దాడి వల్ల మంటలు ట్రక్కులో చెలరేగాయి” అని ఆర్మీ తెలిపింది. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ల కోసం మోహరించిన రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌‌‌‌లోని ఐదుగురు సైనికులు చనిపోయినట్లు చెప్పింది. గాయపడిన మరో సోల్జర్‌‌‌‌‌‌‌‌కు ప్రస్తుతం రాజౌరిలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. దాడి చేసిన వారి జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు వివరించింది. ‘‘పూంచ్ జిల్లాలో జరిగిన దుర్ఘటన బాధాకరమైనది. ట్రక్కులో మంటలు చెలరేగడంతో భారత సైన్యం ధైర్య సైనికులను కోల్పోయింది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలన్నీ మృతుల కుటుంబాల గురించే” అని రక్షణ మంత్రి రాజ్‌‌‌‌నాథ్ సింగ్ అన్నారు. టెర్రర్ దాడి గురించి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌కు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వివరించారు.

పాక్ మంత్రి పర్యటన ఖరారైన రోజే!

పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. ఇండియా పర్యటనకు సంబంధించిన ప్రకటన గురువారమే వెలువడింది. వచ్చే నెలలో గోవాలో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. మరోవైపు మే నెలలో శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం కూడా జరగాల్సి ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని టెర్రర్ దాడి చేసినట్లుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి.