
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ ఎటాక్‌కు కౌంటర్‌గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం (మే 7) హిమాన్షి మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌ను పహల్గామ్ ఉగ్రదాడికి తగిన సమాధానంగా అభివర్ణించారు. ఇది 26 మంది మృతుల కుటుంబాల బాధకు దక్కిన గౌరమన్నారు.
‘‘భారత దళాలు, ప్రధాని మోడీ ప్రభుత్వం ఉగ్రవాదులకు, వారి నిర్వాహకులకు ఆపరేషనన్ సిందూర్ ద్వారా బలమైన సందేశాన్ని పంపాయి. పహల్గాం టెర్రర్ ఎటాక్‌లో మరణించిన 26 మంది మృతుల కుటుంబాలు అనుభవించిన బాధ ఇప్పుడు సరిహద్దు అవతల ఉన్నవారికి తెలిసింది. ఆ రోజు దాడి చేసిన వారిని తన భర్తను విడిచిపెట్టమని వేడుకున్నా. నా పెళ్లి జరిగి ఆరు రోజులే అయిందని వారికి చెప్పాను. కరుణించమని అడిగాను. కానీ ఉగ్రవాదులు మోడీని అడగండని అన్నారు. ఈ రోజు మోడీ జీ, మన సైన్యం వారికి సమాధానం ఇచ్చాయి’’ అని హిమాన్షి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నందుకు సంతృప్తిగా ఉంది.. కానీ తన భర్త వినయ్, దాడిలో మరణించిన 26 మంది ఇప్పుడు మనతో లేకపోవడంతో తీవ్ర దుఃఖం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
►ALSO READ | చెన్నై హోటల్లో సినీ ఫక్కీలో చోరీ.. రూ.23కోట్ల విలువైన వజ్రం కొట్టేసిన దొంగలు
కాగా, 2025, ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. 26 మంది టూరిస్టులను విచక్షణరహితంగా కాల్చి చంపారు. పహల్గాం ఉగ్రదాడి మృతుల్లో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఒకరు. పెళ్లి జరిగిన ఐదు రోజులకే తన భార్య హిమాన్షితో కలిసి పర్యాటక ప్రాంతం పహల్గాంకు వచ్చాడు వినయ్. అదే సమయంలో ఉగ్రవాదులు దాడి చేయడంతో వినయ్ నర్వాల్ మరణించాడు. ఉగ్రదాడిలో మృతి చెందిన భర్త మృత దేహాం పక్కన హిమాన్షి నర్వాల్ కూర్చొని రోదించిన తీరు.. యావత్ దేశ ప్రజల హృదయాలను కదిలించింది.
ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది. 2025, మే 7 బుధవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)తో పాటు పాక్‌లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపింది. ఈ దాడుల్లో వివిధ టెర్రరిస్టు గ్రూపులకు చెందిన దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు.