వంద బుల్లెట్లు కాల్చినా బతికిండు!

వంద బుల్లెట్లు కాల్చినా బతికిండు!
  • మిలిటెంట్ల దాడి నుంచి ఎమర్జెన్సీ స్క్వాడ్‌ మెంబర్​ను కాపాడిన టెస్లా ఈవీ కారు

జెరూసలెం: ఎదురుగా మిలిటెంట్లు.. అందరి చేతుల్లోనూ మిషిన్ గన్నులు.. కారును ఆపలేడు, వెనక్కి వెళ్లనూ లేడు.. దీంతో తెగించి కారును ముందుకే దూకించాడు. తూటాలు దూసుకొచ్చాయి. టైర్ పగిలింది.. కాళ్లు, చేతులకు బుల్లెట్ గాయాలు.. అయినా ఆస్పత్రి దాకా అలాగే వెళ్లిండు. హమాస్ మిలిటెంట్ల దాడిలో గాయపడిన ఓ వ్యక్తి కథ ఇది.

ఎలక్ట్రిక్ కారు కాపాడింది..

కిబ్బుట్జ్ మెఫాల్సిమ్ ఏరియాకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైన భయానక అనుభవాన్ని ఎక్స్ (ట్విట్టర్‌)‌లో ఇజ్రాయెల్‌ ఫ్రీడమ్ పార్టీ చీఫ్ గిలాడ్ ఆల్ఫర్ షేర్ చేశారు. “సీ అనే వ్యక్తి ఎమర్జెన్సీ స్క్వాడ్‌లో సభ్యుడు. హమాస్ మిలిటెంట్ల దాడి మొదలవగానే.. వెంటనే విధుల్లో చేరాలని ‘సీ’కి సమాచారం అందింది. దీంతో తన టెస్లా మోడల్ 3 కారులో బయల్దేరాడు’’ అని వివరించారు. ‘సీ’ ని చూసిన మిలిటెంట్లు మిషిన గన్ లతో బుల్లెట్ల వర్షం కురిపించారు. 

ఈవీ కారని తెలియక ముందు వెనకా కాల్పులు జరిపారు. ఈ రెండూ పని చేయకపోవడంతో టైర్లపై కాల్చారు. టైర్లు పగిలిపోయినా.. ఆస్పత్రిని చేరుకునే దాకా కారును ఆపలేదని ‘సీ’ ట్విట్టర్ లో వెల్లడించాడు.  దీనిపై  ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘ప్రాణాలతో బయటపడ్డందుకు సంతోషం’ అని కామెంట్ చేశాడు.