ఢిల్లీలో టెస్లా ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఢిల్లీలో టెస్లా ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

టెస్లా సోమవారం ఢిల్లీలో తన మొదటి ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగు వీ4 సూపర్‌‌‌‌‌‌‌‌ చార్జర్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేసింది.  టెస్లా కొనుగోలుదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీలు) ఇక్కడ ఛార్జ్ చేసుకోవడానికి వీలుంటుంది.  ఏరోసిటీలోని వరల్డ్‌‌‌‌‌‌‌‌మార్క్ 3 కమర్షియల్ భవనంలో 8,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో  ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. కాగా,  ఇండియాలో తమ మొదటి షోరూమ్‌‌‌‌‌‌‌‌ను  గత నెలలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో    కంపెనీ  ఓపెన్ చేసింది. ఢిల్లీలోని ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ సెంటర్ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉంది. ఇక్కడ కస్టమర్లు టెస్లా వాహనాల ఫీచర్లను పరిశీలించి,  కారు కొనడంపై  నిర్ణయం తీసుకోవచ్చు.