న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీగా సంపాదించుకున్న హోదాను టెస్లా కోల్పోయింది. ఎలన్ మస్క్ రాజకీయ ధోరణులపై వినియోగదారుల్లో వ్యతిరేకత, ఇతర కంపెనీల పోటీ వల్ల అమ్మకాలు వరుసగా రెండో ఏడూ తగ్గాయి. 2025లో టెస్లా 16.4 లక్షల వెహికల్స్ను అమ్మగా, ఇది గత ఏడాదితో పోలిస్తే ఇవి తొమ్మిది శాతం తక్కువ. చైనాకు చెందిన బీవైడీ సంస్థ 22.6 లక్షల బండ్లను అమ్మి మొదటిస్థానంలో ఉంది.
నాలుగో క్వార్టర్ లో టెస్లా అమ్మకాలు 4,18,227 గా నమోదయ్యాయి. ఇది విశ్లేషకులు అంచనా వేసిన 4.40 లక్షల కంటే తక్కువ. అమెరికా టాక్స్ క్రెడిట్ నిలిపివేయడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపిందని భావిస్తున్నారు. ప్రస్తుతం బీవైడీ ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ తయారీ సంస్థగా ఎదిగింది. టెస్లా ఇండియాలో తన ప్రయాణాన్ని సెప్టెంబర్ 2025లో ప్రారంభించింది. మొదటి నెలలో సుమారు కేవలం 61 కార్లను డెలివరీ చేసింది. గత అక్టోబర్లో 40 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
