రాష్ట్రంలో టెస్టులు, కేసులు తగ్గాయ్

రాష్ట్రంలో టెస్టులు, కేసులు తగ్గాయ్
  • ఆదివారం 9,443 టెస్టులు.. 983 మందికి పాజిటివ్‌
  • మొత్తంగా 67,660కి చేరిన బాధితుల సంఖ్య
  • మరో 11 మంది మృతి.. 551కి పెరిగిన మరణాలు
  • దేశంలో వరుసగా ఆరో రోజూ 50 వేల కేసులు

రాష్ట్రంలో సర్కారు లెక్కల ప్రకారం కరోనా కేసుల సంఖ్య 70 వేలకు చేరువైంది. శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 983 మందికి పాజిటివ్ వచ్చింది. ఆదివారం కేవలం 9,443 టెస్టులు మాత్రమే చేయడంతో కేసుల సంఖ్య కూడా తగ్గింది. గ్రేటర్‌ ‌‌‌హైదరాబాద్‌ పరిధిలో 273, జిల్లాల్లో 710 కేసులు నమోదైనట్టు సోమవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌‌లో హెల్త్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. జిల్లాల్లో అత్యధికంగా మేడ్చల్‌‌ (నాన్‌‌జీహెచ్‌‌ఎంసీ ఏరియా) 48, రంగారెడ్డి (నాన్ జీహెచ్‌‌ఎంసీ ఏరియా) 73, వరంగల్‌‌ అర్బన్‌‌లో 57, పెద్దపల్లి 44, నిజామాబాద్‌లో 42, సంగారెడ్డి 37, కరీంనగర్‌‌‌‌లో 54 కేసులు వచ్చాయి. మొత్తంగా రా ష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 67,660కి పెరిగింది. 48,609 మంది కోలుకోగా, 11,911 మంది హోం, ఇన్‌స్టిట్యూష నల్‌‌ఐసోలేషన్‌‌లో ఉన్నారు. మిగతా వారిలో 4,079 మంది ప్రైవేట్ హాస్పిటళ్ళలో 2,510 మంది ప్రభుత్వ దవాఖాన్లలో ట్రీట్‌‌మెంట్ పొందుతు న్నారు. గాంధీ హాస్పిటల్‌‌లో 901 బెడ్ లుసహా మొత్తం సర్కారీ దవాఖానాల్లో5,936 బెడ్ లుఖాళీగా ఉన్నాయ ని.. ప్రైవేటులో 2,520 బెడ్ లుఖాళీ ఉన్నాయని బులెటిన్‌‌లో పేర్కొన్నారు.

మరో 11 మంది మృతి

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా మరణాలు 551కి పెరిగాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు 11 మంది చనిపోయారని కరోనా బులెటిన్‌‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 4,87,238కి చేరగా.. ఆదివారం 9,443 టెస్టులు మాత్రమే చేశారు.