టెక్సస్ ఎయిర్ పోర్ట్​ ఉద్యోగిది ఆత్మహత్యే

టెక్సస్ ఎయిర్ పోర్ట్​ ఉద్యోగిది ఆత్మహత్యే
  • నిర్ధారించిన మెడికల్ ఎగ్జామినర్ 
  • ప్లేన్ ఇంజిన్‌‌‌‌లోకి దూసుకెళ్లి చనిపోయాడని వెల్లడి

హ్యూస్టన్: అమెరికా టెక్సస్‌‌‌‌లోని శాన్ ఆంటోనియో ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ వర్కర్‌‌‌‌ డేవిడ్ రెన్నెర్(27) మృతి ఘటనలో కీలక విషయం బయటపడింది. ప్యాసింజర్‌‌‌‌ ప్లేన్ ఇంజిన్‌‌‌‌లో వర్కర్ ప్రమాదవశాత్తు ఇరుక్కుని చనిపోలేదని.. అతను కావాలనే ఇంజిన్‌‌‌‌లోకి దూసుకెళ్లి సూసైడ్ చేసుకున్నాడని బాక్సర్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ ఆఫీస్ సోమవారం వెల్లడించింది. వర్కర్ పదునైన గాయాలతో మరణించాడని పేర్కొంది. డేవిడ్ ది ఆత్మహత్య అని మెడికల్ ఎగ్జామినర్ నిర్ధారించినందున ఈ ఘటనపై దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు నేషనల్ ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్(ఎన్టీఎస్బీ) తెలిపింది.

డెల్టా ఎయిర్ లైన్స్​కు చెందిన ఓ ప్యాసింజర్‌‌‌‌ ప్లేన్ లాస్ ఏంజిల్స్ నుంచి బయలుదేరి శుక్రవారం రాత్రి టెక్సస్‌‌‌‌లోని శాన్ ఆంటోనియో ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో దిగింది. అయితే, అరైవల్ గేట్‌‌‌‌ వద్ద పార్కింగ్ కోసం విమానం వెళుతుండగా.. గ్రౌండ్‌‌‌‌ వర్కర్‌‌‌‌ డేవిడ్ రెన్నెర్(27) ప్లైట్ ఇంజిన్‌‌‌‌లో ఇరుక్కుని చనిపోయాడు. ఈ ఘటనపై ఎన్టీఎస్బీ దర్యాప్తు చేపట్టిన కొన్ని గంటల్లోనే డేవిడ్ రెన్నెర్​ది ఆత్మహత్య అని మెడికల్ ఎగ్జామినర్ నిర్ధారించారు.