
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సస్‌లో ఓ 18 ఏండ్ల యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులను, తోబుట్టువులను దారుణంగా కాల్చి చంపేశాడు. అందులో ఐదేండ్ల తమ్ముడూ ఉన్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా, సంచలన విషయం వెలుగుచూసింది. ‘‘నా ఫ్యామిలీ నరమాంస భక్షకులు. వారు నన్ను చంపి తినాలని చూస్తున్నారు. అందుకే వాళ్లను చంపేశాను”అని పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు. సీజర్ ఒలాల్డే అనే ఆ యువకుడు తన తల్లిదండ్రులు, తోబుట్టులతో కలిసి టెక్సర్కానాలో నివాసం ఉంటున్నాడు. గత మంగళవారం దాడి విషయం గ్రహించిన స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీజర్‌ని లొంగిపోవాలని ఆదేశించారు. అయితే, అప్పటికే ఇంట్లో ఉన్న తనవాళ్లను అతను కాల్చి చంపేశాడు. తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.