
- అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భేటీ
- డీఎస్సీ కారణంగా వాయిదా కోరిన అభ్యర్థులు
- గత ప్రభుత్వ హయాంలో మూడు సార్లు పోస్ట్ పోన్
- తదుపరి తేదీలపై చర్చిస్తున్న సీఎం
- డిసెంబర్ లో నిర్వహించే చాన్స్!
హైదరాబాద్: గ్రూప్–2 ఉద్యోగాల నియామక పరీక్షను వాయిదా వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గ్రూప్–2 అభ్యర్థులతో చర్చించారు. డీఎస్సీ కారణంగా వాయిదా వేయాలని వారు డిప్యూటీ సీఎంను కోరారు. తాము ప్రిపేర్ కావడానికి సమయం కావాలని, ఈ నేపథ్యంలోనే వాయిదా కోరుతున్నామని అభ్యర్థులు తెలిపారు. సచివాలయాలనికి చేరుకున్న ముఖ్యమంత్రి అభ్యర్థులతో చర్చిస్తున్నారు. డిసెంబర్ లో పరీక్ష నిర్వహించాలని వారు కోరుతున్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో మూడు సార్లు గ్రూప్-2 వాయిదా పడగా.. ఈ ఏడాది ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీ పరీక్షలు కూడా ప్రారంభం కావడంతో గ్రూప్-2 వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. దీంతో సర్కారు వారిపట్ల సానుకూలంగా స్పందించి కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ సారి పరీక్ష వాయిదా పడితే మొత్తం నాలుగు సార్లు పోస్ట్ పోన్ అయినట్టు అయ్యింది. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు.