హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో విషాదం..అపార్ట్ మెంట్ లిఫ్టులో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో విషాదం..అపార్ట్ మెంట్ లిఫ్టులో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్ మదురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడలో విషాదం చోటుచేసుకుంది.  కీర్తి అపార్ట్ మెంట్ లోని లిఫ్ట్ లో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. 

అపార్ట్ మెంట్ ఐదో అంతస్తులో ఉంటున్న  ఐశ్వర్య,నర్సీ నాయుడు దంపతుల రెండో కుమారుడు  హర్ష వర్ధన్(5) నవంబర్ 19న స్కూల్ కు వెళ్లి వచ్చాక లిఫ్ట్ లో తన తల్లి సోదరుడితో కలిసి ఐదో అంతస్తుకు వెళ్లాడు. తిరిగి కిందకు వచ్చేటపుడు నాలుగు, ఐదు ఫ్లోర్  మధ్య లిఫ్ట్ లో ఇరుక్కున్నాడు.  వెంటనే బయటకు తీయగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు వైద్యు లు నిర్ధరించారు.బాలుడి మృతితో అపార్ట్ మెంట్ విషాద చాయలు అలుముకున్నాయి.

 ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు  అపార్ట్ మెంట్ దగ్గర లిఫ్ట్ ను పరిశీలించి దర్యా్ప్తు చేస్తున్నారు.   పోస్టు మార్టం కోసం చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు  తెలిపారు. చిన్నారి తండ్రి ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు.