TG TET notification: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్

TG TET notification: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)కు  నోటీఫికేషన్ విడుదల అయ్యింది. నవంబర్ 5 నుంచి ఆన్ లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపింది విద్యాశాఖ.  2025 జనవరి  1 నుంచి 20 వరకు  ఆన్ లైన్ లో  టెట్ ఎగ్జామ్స్  జరగనున్నాయి.   

ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే..  మొదటి టెట్ ను జూన్ లో నిర్వహించింది ప్రభుత్వం.

మరో డీఎస్సీ వేసేందుకు సర్కారు సిద్ధమవుతుంది. 2025 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు వెళ్లాలని భావిస్తుంది.