బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గుర్తింపును సొంతం చేసుకున్న నటి దీపికా పదుకోణె. 2006లో కన్నడ మూవీ ఐశ్వర్యలో టైటిల్ పాత్రలో నటించిన ఈ భామ మరుసటి ఏడాది బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఓం శాంతి ఓం సినిమాలో షారుక్ ఖాన్ సరసన ద్విపాత్రా భినయం చేసింది. అప్పటి నుంచి కల్కి 2898 ఏడీ వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ కొన్ని సార్లు స్క్రిప్ట్ ఎంపికలో తప్పులు చేసిందట. లేటెస్ట్ గా ఓ ఇంటర్యూలో ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
రెమ్యూన రేషన్ ముఖ్యం కాదు..
బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో దీపిక ఒకరు. అయితే ఇకపై పెద్ద బడ్జెట్ సినిమాలు, భారీ వసూళ్లు తనను ఉత్సాహపరచు లేవంటూ లేటెస్ట్ గా ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.అయితే తాను ఆ వ్యక్తులను, ఆ కథలోని సందేశాన్ని నమ్మి అంగీకరిస్తానని చెప్పింది. గతంలో ఇంత స్పష్టంగా ఆలోచించలేక పోయానని తెలిపింది. రెమ్యూన రేషన్ ముఖ్యం కాదని, అందుకు విరుద్దమైన వాస్తవాలు కూడా ఉంటాయని వివరించింది. నిజాయితీగా చెప్పాలంటే... ఇంకా ఎంత పేరు, ఎంత విజయం, ఎంత డబ్బు కావాలి? అని ఆమె ప్రశ్నించింది. ఈ దశలో నాకు అది ముఖ్యం కాదు. ఇది రూ.100 కోట్ల సినిమాల గురించో లేదా రూ.600 కోట్ల సినిమాల గురించో కాదు అని చెప్పింది
భారీ ప్రాజెక్టుల నుంచి వైదొలగడం వెనుక...
భారీ సినిమాలపై ఆసక్తి తగ్గడానికి బదులు, ఇప్పుడు తన దృష్టి సరళమైన, లోతైన కథనాలపై ఉందని, ఇతర కళాకారులను ప్రోత్సహించడంపై ఉందని దీపికా తెలిపింది. ఈ ఏడాది దీపికా భారీ ప్రాజెక్టుల నుంచి వైదొలగడం వార్తల్లో నిలిచింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందాల్సిన 'స్పిరిట్' చిత్రం నుంచి ఆమె తప్పుకుంది. ఆమె కొత్తగా తల్లి కావడంతో 8 గంటల షిఫ్ట్, మరికొన్ని షరతులు విధించిందని, దాంతో ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు.. ఆ తర్వాత, 2024 బ్లాక్‌బస్టర్ హిట్ అయిన 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌లో దీపికా తిరిగి నటించబోదని ఆగస్టులో నిర్మాతలు ప్రకటించారు.
►ALSO READ | SS Rajamouli: దర్శకుడు రాజమౌళిపై 3 కేసులు.. 'వారణాసి' రిలీజ్‌కు ముందే చిక్కులు.. వివాదం ఎందుకంటే?
అల్లు అర్జున్ సరసన..
కొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నప్పటికీ.. దీపికా పదుకొణె రెండు భారీ చిత్రాలతో బిజీగా ఉంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో, షారుక్ ఖాన్‌తో కలిసి దీపికా నటిస్తున్న ఈ చిత్రంలో సుహానా ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం 2026లో విడుదల కానుంది. మరోకటి అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వస్తున్న 'AA22xA6' చిత్రంలో దీపికా నటిస్తోంది. ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్టు 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
