బైకర్దాదీస్..80ఏళ్ల వయసులో వీధుల్లో బైక్‌పై చక్కర్లు..పాతకాలపు స్కూటర్తొట్టిలో అక్కను కూర్చోబెట్టుకొని సరిలేరు మాకెవ్వరూ అంటూ రయ్ రయ్‌మంటూ వీధుల్లో దూసుకెళ్తోంది ఓ బామ్మ. స్థానికులు, నెటిజన్లతో బైకర్ దాదీస్ అని పిలిపించుకుంటున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 8పదుల వయసులో దాదీలు వీధుల్లో బైక్‌పై ఎంజాయ్‌చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అహ్మదాబాద్‌కు చెందిన మందాకినీ షా, ఆమె చెల్లెలు ఉషా..87ఏళ్ల వయసు.. అయినా జోరు, ఉషారు ఏమాత్రం తగ్గలే..ఆ వయసులో కూడా తగ్గేదేలే అన్నట్లు బైక్ పై దూసుకెళ్తూ.. అభిరుచి, తపన ఉంటే చాలు వయసుతో పనేంటీ అంటున్నారు.
హ్యూమన్ ఆఫ్ బాంబే అనే ఫొటో బ్లాగ్ లో ఈ మందాకినీ సిస్టర్స్ స్టోరీ ప్రచురించబడిన తర్వాత వాళ్లిద్దరు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయారు. ఈ ఫీచర్ లో స్కూటర్ ను నడుపుతున్న మందాకినీ బైక్ కథను రాశారు. బైకులంటే బామ్మ మహాఇష్టం..మోపెడ్నుంచి జీప్ వరకు అన్నీ నడిపింది.
ఈ మందాకినీ సిస్టర్స్ఆ ప్రాంతంలో తెలియని వారుండరు.ట్రాఫిక్ పోలీసులు కూడా ఏం బామ్మ మీ స్కూటర్ ఇంకా నడుస్తూనే ఉందా అని అడుగుతుంటారట. ఇక మందాకిని సిస్టర్ ఉషా స్కూటర్ పై వెళ్తుంటే తన ముఖం మీద గాలి తగులుతుంటే..16యేళ్ల వయసున్న అనుభూతి కలుగుతుందని చెబుతోంది.
వయసు శరీరానికి ముసలితనం తేవొచ్చుగానీ మనసుకు కాదు.. ప్రతి రోజూ స్నేహితులను కలుస్తాం.. పాడుతాం.. ఆడుతాం.. నేర్చుకున్నవి ఇతరులకు నేర్పిస్తాం.. సమాజం ఊహించని జీవితాన్ని మేం గడిపేస్తున్నాం అంటూ ఈ బైకర్ దాదీలు చెబుతున్నారు.
