Under-19 ODI World Cup schedule: 16 జట్లతో ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్.. తొలి మ్యాచ్ లో USAతో ఇండియా ఢీ

Under-19 ODI World Cup schedule: 16 జట్లతో ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్.. తొలి మ్యాచ్ లో USAతో ఇండియా ఢీ

ఐసీసీ అండర్-19 క్రికెట్ షెడ్యూల్ ఐసీసీ బుధవారం (నవంబర్ 19) ప్రకటించింది. జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా ఐసీసీ టోర్నీ జనవరి 15 నుండి ఫిబ్రవరి 6 వరకు జరుగుతుంది. ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో యూఎస్ఏతో   ఇండియా తలపడనుంది.  ఈ టోర్నమెంట్‌లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి.  ఈ ఈవెంట్ లో టాంజానియా తొలిసారి ఆడబోతుంది. 23 రోజుల పాటు మొత్తం 41 మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశలో  16 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించబడ్డాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. 

మొత్తం 12 జట్లు ఒక్కొక్కటి ఆరు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించబడతాయి. ప్రతి గ్రూప్ లో టాప్-2 లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లకు రిజర్వ్ డేలు అందుబాటులో ఉన్నాయని ఐసీసీ తెలిపింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ (హరారే), తకాషింగా స్పోర్ట్స్ క్లబ్ (హరారే), క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ (బులవాయో) ఆతిధ్యం ఇస్తాయి. నమీబియాలోని నమీబియా క్రికెట్ గ్రౌండ్ (విండ్‌హోక్), HP ఓవల్ (విండ్‌హోక్) వేదికల్లో మ్యాచ్ లు జరుగుతాయి. 

►ALSO READ | BAN vs IRE: దిగ్గజాల లిస్ట్‌లో ముష్ఫికర్.. 100వ టెస్టులో సెంచరీ దిశగా బంగ్లా వెటరన్ ప్లేయర్

గ్రూప్ ఏ లో ఇండియా, యూఎస్ఏ, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లున్నాయి. గ్రూప్ బి లో జింబాబ్వే, పాకిస్తాన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ సి లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో పాటు ఐర్లాండ్, జపాన్, శ్రీలంక ఉన్నాయి.గ్రూప్ డిలో టాంజానియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా ఉన్నాయి. ఇండియా మ్యాచ్ ల విషయానికి వస్తే తొలి మ్యాచ్‌ను జనవరి 15న  యూఎస్ఏతో.. జనవరి 17న బంగ్లాదేశ్‌.. జనవరి  24న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. టీమిండియా లీగ్ మ్యాచ్ లన్నీ బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతాయి.

అండర్-19 మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2026 షెడ్యూల్:

జనవరి 15, యూఎస్ఏ v ఇండియా, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
15 జనవరి, జింబాబ్వే v స్కాట్లాండ్, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే
15 జనవరి, టాంజానియా v వెస్టిండీస్, HP ఓవల్, విండ్‌హోక్
16 జనవరి, పాకిస్తాన్ v ఇంగ్లాండ్, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే
జనవరి 16, ఆస్ట్రేలియా v ఐర్లాండ్, నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్
16 జనవరి, ఆఫ్ఘనిస్తాన్ v దక్షిణాఫ్రికా, HP ఓవల్, విండ్‌హోక్
17 జనవరి, ఇండియా v బంగ్లాదేశ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
జనవరి 17, జపాన్ v శ్రీలంక, నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్
18 జనవరి, న్యూజిలాండ్ v యూఎస్ఏ, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
18 జనవరి, ఇంగ్లండ్ v జింబాబ్వే, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే
జనవరి 18, వెస్టిండీస్ vs ఆఫ్ఘనిస్తాన్, HP ఓవల్, విండ్‌హోక్
19 జనవరి, పాకిస్తాన్ v స్కాట్లాండ్, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే
19 జనవరి, శ్రీలంక v ఐర్లాండ్, నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్
19 జనవరి, దక్షిణాఫ్రికా v టాంజానియా, HP ఓవల్, విండ్‌హోక్
జనవరి 20, బంగ్లాదేశ్ v న్యూజిలాండ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
జనవరి 20, ఆస్ట్రేలియా v జపాన్, నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్
21 జనవరి, ఇంగ్లాండ్ v స్కాట్లాండ్, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే
21 జనవరి, ఆఫ్ఘనిస్తాన్ v టాంజానియా, HP ఓవల్, విండ్‌హోక్
22 జనవరి, జింబాబ్వే v పాకిస్తాన్, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే
జనవరి 22, ఐర్లాండ్ v జపాన్, నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్
జనవరి 22, వెస్టిండీస్ v దక్షిణాఫ్రికా, HP ఓవల్, విండ్‌హోక్
23 జనవరి, బంగ్లాదేశ్ v యూఎస్ఏ, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే
జనవరి 23, శ్రీలంక v ఆస్ట్రేలియా, నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్
జనవరి 24, ఇండియా v న్యూజిలాండ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
24 జనవరి, A4 v D4, HP ఓవల్, విండ్‌హోక్
జనవరి 25, సూపర్ సిక్స్ A1 vs D3, నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్
జనవరి 25, సూపర్ సిక్స్ D2 v A3, HP ఓవల్, విండ్‌హోక్
26 జనవరి, B4 v C4, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
జనవరి 26, సూపర్ సిక్స్ C1 vs B2, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
జనవరి 26, సూపర్ సిక్స్ D1 vs A2, నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్
జనవరి 27, సూపర్ సిక్స్ C2 vs B3, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
జనవరి 27, సూపర్ సిక్స్ C3 vs B1, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
జనవరి 28, సూపర్ సిక్స్, A1 vs D2, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
జనవరి 29, సూపర్ సిక్స్ D3 vs A2, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
జనవరి 30, సూపర్ సిక్స్ D1 vs A3, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
జనవరి 30, సూపర్ సిక్స్ B3 vs C1, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
జనవరి 31, సూపర్ సిక్స్ B2 vs C3, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
ఫిబ్రవరి 01, సూపర్ సిక్స్ B1 vs C2, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
ఫిబ్రవరి 03, మొదటి సెమీ-ఫైనల్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
ఫిబ్రవరి 04, రెండవ సెమీ-ఫైనల్, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
ఫిబ్రవరి 06, ఫైనల్, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే