సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలపై జనానికి అవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌ : టీజీ సీఎస్‌‌‌‌బీ డైరెక్టర్‌‌‌‌ శిఖా గోయల్‌‌‌‌ వెల్లడి

సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలపై జనానికి అవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌ : టీజీ సీఎస్‌‌‌‌బీ డైరెక్టర్‌‌‌‌ శిఖా గోయల్‌‌‌‌ వెల్లడి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రజలు సైబర్‌‌‌‌ నేరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సైబర్‌‌‌‌ జాగరూకత’ పేరిట గురువారం రాష్ట్రవ్యాప్తంగా టీజీసీస్‌‌‌‌బీ, పోలీస్‌‌‌‌  సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 

పలు ప్రాంతాల్లో మార్నింగ్‌‌‌‌  వాకర్స్‌‌‌‌ కోసం 117 సెషన్లు, విద్యార్థులు, వృద్ధులు, గృహిణులు, ప్రైవేటు ఉద్యోగులు ఇతర సాధారణ పౌరుల కోసం 387 అవగాహన సెషన్లు నిర్వహించారు. ఈ విషయాన్ని టీజీ సీఎస్‌‌‌‌బీ డైరెక్టర్‌‌‌‌ శిఖా గోయల్‌‌‌‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్  జాగరూకత ప్రతినెలా మొదటి బుధవారం నిర్వహించన్నట్లు ఆమె వెల్లడించారు.