పీఎస్, యూపీఎస్ టీచర్ల కు ఇంటర్ ఎగ్జామ్ డ్యూటీలొద్దు : రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజభాను చంద్ర ప్రకాష్

పీఎస్, యూపీఎస్ టీచర్ల కు ఇంటర్ ఎగ్జామ్ డ్యూటీలొద్దు : రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజభాను చంద్ర ప్రకాష్
  •     ప్రభుత్వానికి టీజీహెచ్ఎంఏ విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్ల టీచర్లకు ఇంటర్మీడియట్ పరీక్షల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ (టీజీహెచ్ఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజభాను చంద్ర ప్రకాష్, ప్రధాన కార్యదర్శి జి.హేమచంద్రుడు, ముఖ్యసలహాదారు పర్వతి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. 

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు టీచర్లను ఇన్విజిలేటర్లుగా వేయడంతో ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ల చదవులపై ప్రభావం పడుతోందన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేశారు.