
- టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ పాత క్యాంపస్‌లో రెండు విడతల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ప్రతీరోజు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు వెరిఫికేషన్ జరుగుతుందని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
జనరల్ కేటగిరిలో 775 మంది, స్పోర్ట్స్ కేటగిరిలో ఎంపికైన ఇద్దరు అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ ను https://www.tspsc.gov.in వెబ్ సైట్లో పెట్టామని వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం జూన్ 11న రిజర్వ్ డేగా పెట్టామని చెప్పారు. ఈనెల 26న వెబ్ సైట్ లో షెడ్యూల్ పెడ్తామన్నారు. ఈనెల 27 నుంచి జూన్ 11 సాయంత్రం 5:00 వరకు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో వెబ్ ఆప్షన్స్ కు అవకాశం ఉంటుందని తెలిపారు.