
తెలంగాణ గ్రూప్ 2 ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేసింది టీజీపీఎస్ సీ. సెప్టెంబర్ 28న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీజీపీఎస్ సీ) ఛైర్మన్ బుర్రా వెంకటేశం రిలీజ్ చేశారు.783 పోస్టులకు 782 మంది ఎంపికయ్యారు. కోర్టు కేసు కారణంగా ఒక్క పోస్టు రిజల్ట్ ను పెండింగ్ లో పెట్టింది. ఎగ్జామ్స్ నిర్వహించిన 10 నెలలలోపే ఫలితాలు వెల్లడించామని బుర్రా వెంకటేశం చెప్పారు.
శనివారం (సెప్టెంబర్ 27) గ్రూప్1 నియామక పత్రాలు అందజేసిన నేపథ్యంలో.. గ్రూప్ 2కు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కూడా దసరా లోపే నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం 2022లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 2024 డిసెంబర్లో రాత పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు 2,49,964 మంది అభ్యర్థులు ఎగ్జామ్స్కు అటెండ్ అయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లను 2025 మార్చిలో టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. మొత్తం 2,36,649 జనరల్ ర్యాకింగ్ లిస్టును వెల్లడించింది. ఇవాళ ఫైనల్ లిస్ట్ ఫలితాలను విడుదల చేసింది.