గ్రూప్ 2 ఫలితాలు విడుదల..టాపర్ ఇతనే.

గ్రూప్ 2 ఫలితాలు విడుదల..టాపర్ ఇతనే.
  • రిలీజ్‌‌‌‌ చేసిన టీజీపీఎస్సీ చైర్మన్​ బుర్రా వెంకటేశం
  • 782 మంది సెలెక్ట్.. కోర్టు కేసుతో ఒక పోస్టు పెండింగ్‌‌‌‌
  • సెలెక్టెడ్​ లిస్ట్‌‌‌‌ను వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పెట్టిన కమిషన్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో గ్రూప్ –2 ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. మొత్తం 783 పోస్టులకు గానూ ఎంపికైన 782 మంది జాబితాను ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆఫీసులో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. వీహెచ్​ కేటగిరీలో  కోర్టు కేసు కారణంగా ఒక ఫలితం పెండింగ్‌‌‌‌ పడింది. ఆ రిజల్ట్‌‌‌‌ను విత్‌‌‌‌హెల్డ్‌‌‌‌లో పెట్టారు. ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు, అలాటైన పోస్టుల వివరాలను కమిషన్ అధికారిక వెబ్ సైట్​ https://www.tspsc.gov.in లో పొందుపర్చారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ... గ్రూప్ 2 పరీక్ష నిర్వహించిన కేవలం 10 నెలల్లోనే ఫలితాలు ఇచ్చామని తెలిపారు. గ్రూప్–1 పరీక్షతో లింక్‌‌‌‌ ఉండటంతో కొంత ఆలస్యమైందని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు కమిషన్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కోర్టులో కేసులున్న నేపథ్యంలో తుది తీర్పుకు లోబడి ఫలితాలుంటాయని వెల్లడించారు.ఎవరైనా అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇస్తే.. ఏ దశలోనైనా ఎంపిక రద్దు చేసే అధికారం కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీపీఎస్సీ సభ్యులు ఎన్.యాదయ్య, అమీర్ ఉల్లాఖాన్, పాల్వాయి రజని, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ లక్ష్మీకాంత్ రాథోడ్, కమిషన్ సెక్రెటరీ ప్రియాంక అల, తదితరులు పాల్గొన్నారు.

రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ ఇలా..

రాష్ట్రవ్యాప్తంగా 18 కేటగిరీలకు సంబంధించి 783 గ్రూప్–​ 2 పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2024లో డిసింబర్ 15,16వ తేదీల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 5,51,855 మంది అప్లై చేయగా, వారిలో 2,49,964 మంది ఎగ్జామ్స్​ రాశారు.  పరీక్షల ఫలితాలను మార్చి11న రిలీజ్ చేయగా, 2,36,649 మందితో జనరల్ ర్యాకింగ్ లిస్టు (జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను టీజీపీఎఎస్సీ విడుదల చేసింది. పలు విడతల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టుగా18 కేటగిరీల పోస్టులకు సంబంధించిన గ్రూప్– 2 ఫైనల్ లిస్టును కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్​ చేసింది. కాగా, గ్రూప్ 1కు ఎంపికైన పలువురు అభ్యర్థులు గ్రూప్ 2కు కూడా ఎంపికయ్యారు. ఈ లిస్టులో వారు ఏకంగా 60 నుంచి 80 మంది వరకు ఉన్నారు. ఎంపికైన వారికి దసరాలోపే పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేందుకు అధికారులుకసరత్తు చేస్తున్నారు. 

టాప్ 10  ర్యాంకర్ల వివరాలు 

ర్యాంక్  పేరు                            ఎంపికైన పోస్టు 
1    నారు వెంకట హరవర్ధన్    ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో జీఏడీ 
2    వడ్లకొండ సచిన్               సబ్ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
3    మనోహర్ రావు                 సబ్ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
4    శ్రీరామ్ మధు                   సబ్ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
5    చింతలపల్లి ప్రీతమ్ రెడ్డి     సబ్ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
6    అఖిల్ ఎర్ర                      సబ్ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
7    గొడ్డేటి అశోక్                మున్సిపల్ కమిషనర్ 
8    చిమ్ముల రాజశేఖర్    నాయబ్ తహసీల్దార్ 
9    మేకల ఉపేందర్           సబ్ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
10    కరింగు నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌          మున్సిపల్ కమిషనర్

విమెన్స్ టాపర్స్ 

1    లక్కిరెడ్డి వినీషా రెడ్డి    నాయబ్ తహసీల్దార్​
2    సుష్మిత                      నాయబ్ తహసీల్దార్​  
 3    శ్రీవేణి                       నాయబ్ తహసీల్దార్​  
4    శ్రీలత                          మున్సిపల్ కమిషనర్ 
5    గొట్టిముక్కల స్నేహ     నాయబ్ తహసీల్దార్​