V6 News

పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 సైంటిస్ట్ పోస్టులు..టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల 

పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 సైంటిస్ట్ పోస్టులు..టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2 ) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 20 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి హరిత ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల వయస్సు జులై1, 2026 నాటికి 18 నుంచి 34 ఏండ్ల మధ్య ఉండాలని సూచించారు. విద్యార్హతలు, సిలబస్, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌‌సైట్ https://www.tgpsc.gov.in ను సందర్శించాలని సూచించారు.