- టీజీపీడబ్ల్యూయూ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్
హైదరాబాద్, వెలుగు: గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత అవసరమని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫారమ్ వర్కర్స్ యూనియన్(టీజీపీడబ్ల్యూయూ) వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ అన్నారు. దేశఆర్థిక వృద్ధిలో గిగ వర్కర్ల పాత్రను గుర్తించడం ఆహ్వానించదగ్గ పరిణామమని గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. కేవలం వెసులుబాటు పేరుతో కార్మికుల హక్కులను విస్మరించకూడదని చెప్పారు.
దేశంలో దాదాపు 40శాతం గిగ్ ప్లాట్‌ఫారమ్ కార్మికులు నెలకు రూ.15 వేల కంటే తక్కువ ఆదాయంతో జీవనాన్ని కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది వారి కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోదని గుర్తు చేశారు. గిగ్ వర్కర్లందరికీ నెలకు కనీస వేతనం అందేలా చూడాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా పథకాలను వర్తింపజేయాలన్నారు.
