ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి : ఆర్టీసీ బీసీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి : ఆర్టీసీ బీసీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్

నాగర్‌‌‌‌కర్నూల్ టౌన్, వెలుగు: టీజీఎస్ ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని టీజీఎస్ ఆర్టీసీ బీసీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ డిమాండ్ చేశారు. శనివారం నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌లో వి.ఎస్. నారాయణ అధ్యక్షతన సంఘం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌‌‌‌లో ఉన్న ఏరియర్స్, పే స్కేల్‌‌‌‌ను తక్షణమే అమలు చేయాలని కోరారు. సమావేశంలో తిరుపతయ్య, యాదయ్య, చారి, నాగయ్య గౌడ్, శ్రీనివాసులు, పరశురాం తదితరులు పాల్గొన్నారు.