నల్గొండ: రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తాం : టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్వి. పాటిల్ 

నల్గొండ: రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తాం : టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్వి. పాటిల్ 
  • నల్గొండ పర్యటనలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్​వి. పాటిల్ 

నల్గొండ, వెలుగు:  రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే ప్రధాన లక్ష్యమని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, సీఎండీ జితేశ్​వి. పాటిల్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆయన మునుగోడు, నకిరేకల్, నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లోని వివిధ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్లతో పాటు దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తిప్పర్తి, చిట్యాల మండలాల్లో నేరుగా వరి పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడి కరెంట్ సరఫరా తీరుతెన్నులు, లో-వోల్టేజీ సమస్యలు, బోర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు.

విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉందని రైతులు తెలపగా, చిన్నచిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. భవిష్యత్ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో ఉంచుకుని నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ సామర్థ్యాన్ని పెంచాలని, ట్రిప్పింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమావేశమై కొత్త సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్ల ఏర్పాటు, లైన్ల బలోపేతంపై చర్చించి పలు సూచనలు చేశారు.