TGSRTC: జనాలకు భలే ఛాన్సులే.. లక్కీ ఛాన్సులే.. తక్కువ రేట్లకు సామాన్లు దక్కించుకున్న జనాలు

TGSRTC: జనాలకు భలే ఛాన్సులే.. లక్కీ ఛాన్సులే.. తక్కువ రేట్లకు సామాన్లు  దక్కించుకున్న జనాలు
  • ఆర్టీసీ కార్గోలో వస్తువుల వేలానికి భారీ స్పందన 

హైదరాబాద్​సిటీ,వెలుగు : ఆర్టీసీ కార్గో సర్వీస్​సెంటర్​లో డెలివరీ కానివస్తువుల అధికారులు వేస్తున్న వేలానికి పెద్ద సంఖ్యలో స్పందన వస్తోంది. 45 రోజుల తర్వాత కూడా కార్గోలో వచ్చిన వస్తువులను తీసుకోకపోతే ఆర్టీసీ వేలం వేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం, గురువారం జేబీఎస్​కార్గో సెంటర్​లో పలు వస్తువులకు వేలం నిర్వహించారు. దీనికి పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు తరలివచ్చారు. 

ఈ వేలంలో టీవీలు, ఎలక్ట్రిక్​స్టవ్, ఐరన్​బాక్స్​, మొబైల్స్, ఏసీలు, కుక్కర్స్​ఉండగా వాటిని దక్కించుకునేందుకు పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చారని గ్రేటర్​ఆర్టీసీ అసిస్టెంట్​ ట్రాఫిక్​మేనేజర్​(లాజిస్టిక్స్​) ఇషాక్​ బిన్​మహ్మద్​ తెలిపారు. ఆ118 వస్తువులను వేలం వేయగా 60 వస్తువులు అమ్ముడుపోయాయన్నారు. వేలం ద్వారా రూ. 44,590 ఆదాయం వచ్చిందని చెప్పారు. శుక్రవారం కూడా కొన్ని రకాల వస్తువుల వేలం ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలన్నారు.  

రూ.500కే స్టవ్ వచ్చింది
 
ఆర్టీసీ కార్గోలో వచ్చిన వస్తువులు వేలం వేస్తున్నారని పేపర్లలో చూసి వచ్చినా. నాకు ఎలక్ట్రిక్​ఇండస్​స్టవ్​ అవసరం ఉండే..అసలు ధర వెయ్యికి పైగానే ఉంటది. నాకు లక్కీగా రూ. 500 కే వచ్చింది.  – మహ్మద్ ​జక్రియా   

రూ.13 వేలకే ఏసీ కొన్నా  

రూ. 25వేలు ఉండే ఏసీ నాకు రూ.13వేలకే వచ్చింది. ఎండాకాలం రేట్లు ఎక్కువుంటయని, నేను చలికాలంలో ఏసీ కొందామని అనుకున్నా...ఆర్టీసీలో వేలం పాట పెడుతున్నరని తెలిసి ట్రై చేద్దామని వచ్చినా...మంచి కంపెనీ ఏసీ..కొత్తది నాకు  చీప్​గా వచ్చింది.