ఐటీ కారిడార్లో ఆర్టీసీ అడ్డా!. ఐటీ సంస్థలకు అద్దెకు బస్సులు

ఐటీ కారిడార్లో ఆర్టీసీ అడ్డా!. ఐటీ సంస్థలకు అద్దెకు బస్సులు

 

  • సొంత వెహికల్స్, క్యాబ్​లు వాడుతున్న ఐటీ ఎంప్లాయీస్​
  • పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ వైపు మళ్లాలని కంపెనీలతో సజ్జనార్​ మీటింగ్స్​ 
  • తమ బస్సులను అద్దెకు తీసుకోవాలని సలహా 
  • ట్రాఫిక్​ సమస్య పరిష్కారమవుతుందని సూచన

హైదరాబాద్​సిటీ, వెలుగు: పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ విస్తరణలో భాగంగా ఐటీ కారిడార్​లో బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. ఎక్కువగా సొంత వాహనాలతో పాటు ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి ప్రైవేట్​వెహికల్స్​లో ఆఫీసులకు వెళ్తున్నారు. అలాగే ఐటీ కంపెనీలు భారీగా ప్రైవేట్​వాహనాలను రెంట్​కు తీసుకుని తమ ఎంప్లాయీస్​కు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులను బస్సుల వైపు మళ్లించేలా ఆర్టీసీ ప్లాన్​చేస్తున్నది. ఇందులో భాగంగా ఐటీ కంపెనీలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చూస్తున్నది. ఈ మేరకు ఆయా సంస్థలతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

త్వరలో 275 ఎలక్ట్రిక్ ​బస్సులు 

ఐటీ కారిడార్ లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు నడిపిస్తుండగా, త్వరలో మరో 275 బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ఎండీ సజ్జనార్​తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ, అసోసియేటేడ్ చాంబ‌‌‌‌‌‌‌‌ర్స్ ఆఫ్ కామ‌‌‌‌‌‌‌‌ర్స్ అండ్ ఇండ‌‌‌‌‌‌‌‌స్ట్రీ  ఆఫ్ ఇండియా(అసోచామ్‌‌‌‌‌‌‌‌), తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కౌన్సిల్ సంయుక్తంగా ఐటీ కారిడార్ లో మెరుగైన ర‌‌‌‌‌‌‌‌వాణా సౌక‌‌‌‌‌‌‌‌ర్యాల క‌‌‌‌‌‌‌‌ల్పన‌‌‌‌‌‌‌‌ కోసం కంపెనీల ప్రతినిధుల‌‌‌‌‌‌‌‌తో స‌‌‌‌‌‌‌‌మావేశం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో హైటెక్ సిటీలోని టెక్ మ‌‌‌‌‌‌‌‌హీంద్రా క్యాంప‌‌‌‌‌‌‌‌స్​లో జరిగిన సమావేశంలో ఆర్టీసీ ఎండీ స‌‌‌‌‌‌‌‌జ్జనార్​మాట్లాడుతూ.. ప్రైవేట్​వాహనాల వినియోగం వల్ల ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవడమే దీనికి పరిష్కారమన్నారు. ఇది పర్యావరణాన్ని కూడా కాపాడుతుందన్నారు. పబ్లిక్​ట్రాన్స్​పోర్ట్​వినియోగించుకునే ఉద్యోగులకు ప్రోత్సహకాలిచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐటీ కారిడార్ లో ఆర్టీసీ అందిస్తున్న సేవలను ఉన్నతాధికారులు వివరించారు. అసోచామ్ సదరన్​ సెక్టార్ కో చైర్మన్, వర్చుసా వైస్ ప్రెసిడెంట్ కృష్ణ ఎదుల, టీఎఫ్ఎంసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ మదాల, హెచ్ఆర్ హెడ్, టెక్ మహీంద్రా వినయ్ అగర్వాల్, ఆర్టీసీ ఈడీలు ముని శేఖర్, రాజశేఖర్, సీటీఎం శ్రీదేవి, పాల్గొన్నారు.