- జూబ్లీ బస్ స్టేషన్లో స్టిక్కర్లు, పోస్టర్లు ఆవిష్కరణ
హైదరాబాద్సిటీ, వెలుగు: హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్లో మేడారం ప్రసాదం ఆన్లైన్ బుకింగ్ స్టిక్కర్లు, పోస్టర్ను ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ సోమవారం ప్రారంభించారు.
భక్తులు tgsrtclogistics.co.in వెబ్సైట్ ద్వారా సులభంగా ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్ శ్రీనివాస్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ మహ్మద్ బిన్ ఇషాక్ పాల్గొన్నారు.
