
పొల్యుషన్ కంట్రోల్ చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన 13 చార్జింగ్ స్టేషన్లను, ఎలక్ట్రిక్ బస్సులను రేవంత్ రెడ్డి త్వరలో ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జిసిసి) మోడల్‌లో పనిచేస్తాయి.
1000 ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ లో తిరగనున్నాయి. మిగతావి ఎలక్ట్రిక్ బస్సులు సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి అధిక ట్రాఫిక్ రూట్లలో నడుస్తాయి. హెచ్‌సీయూ, హయత్‌నగర్ వంటి డిపోలలోని డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేసి.. గతంలో ఉన్న వాటిని గ్రామీణ ప్రాంతాలకు కేటాయించనున్నారు.
ఎంజీబీఎస్, జేబీఎస్, హెచ్‌సీయూ, హయత్‌నగర్-2, రాణిగంజ్,కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్,హైదరాబాద్-2, వరంగల్, సూర్యాపేట, కరీంనగర్-2, నిజామాబాద్ సహా పలు డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో స్టేషన్‌లో 20 నుంచి 25 ఛార్జింగ్ గన్‌లు ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ బస్సులు ఒకే సమయంలో ఛార్జ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీ ఎయిర్ పోర్ట్ రూట్లలో 49 పుష్పక్ బస్సులు, విజయవాడ, హైదరాబాద మధ్య 10 ఎలక్ట్రానిక్ బస్సులతో సహా మొత్తం 100 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది.