గుడ్ న్యూస్: ఖైరతాబాద్ బాలాపూర్ గణేశ్ మండపాలకు JBS, MGBS నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

గుడ్ న్యూస్: ఖైరతాబాద్ బాలాపూర్ గణేశ్ మండపాలకు JBS, MGBS నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
  • ఈ నెల 14 నుంచి 24 వరకు నడపనున్న ఆర్టీసీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేశ్ మండపాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ బస్సులు ఈ నెల 14 నుంచి 24 వరకు జేబీఎస్, ఎంజీబీఎస్​నుంచి అందుబాటులో ఉంటాయని సంస్థ ఎండీ నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ రూట్​లో మండపాలకు..

ప్రత్యేక బస్సులు జేబీఎస్ నుంచి ప్రారంభమై ప్యాట్నీ, బాటా, బోట్ క్లబ్,  ట్యాంక్ బండ్, ఐమ్యాక్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, గాంధీ భవన్, అఫ్జల్‌‌గంజ్, సీబీఎస్/ఎంజీబీఎస్, విమెన్స్ కాలేజ్, జె.గార్డెన్, గవర్నమెంట్ ప్రెస్, ఐఎస్ సదన్, పిసల్‌‌బండ, మిధాని టౌన్ షిప్, బాలాపూర్ ఎక్స్ రోడ్, శివాజీ చౌక్​ల మీదుగా బాలాపూర్ వరకు నడుస్తాయి. 

జేబీఎస్ వద్ద ఉదయం 6 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమై రాత్రి 9.55 గంటల వరకు ప్రతీ 40 నుంచి 50 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటుంది. అలాగే, బాలాపూర్ గణేశ్​మండపం నుంచి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7.55 గంటలకు ప్రారంభమై రాత్రి 11.50 గంటల వరకు నడుస్తాయని ఆర్టీసీ ఎండీ తెలిపారు.