న్యూయార్క్: ఉగ్రవాద మూలాలను ఏరిపారేయడంలో అమెరికా, దాని మిత్రపక్షాలు కీలక విజయాలు సాధించాయని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో అమెరికా వెల్లడించింది. 9/11 దాడులు జరిగి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా యూఎన్ఎస్సీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. గత ఐదేళ్లలో ఉగ్రవాద నిరోధక అంశంపై భద్రతామండలి తొలిసారిగా ఒక అధ్యక్ష ప్రకటనను ఆమోదించింది.
అంతర్జాతీయ శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదానికి మతం, జాతీయత, నాగరికత, వర్గానికి ఆపాదించకూడదని పేర్కొంది. అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ మాట్లాడుతూ అల్-ఖైదా అగ్రనేత బిన్ లాడెన్‌తో పాటు ఐఎస్ఐఎస్ చీఫ్ అల్-బగ్దాది, జవహిరిలను తాము వేటాడి మట్టుబెట్టామని గుర్తుచేశారు. ఐఎస్ఐఎస్, అల్-ఖైదా నెట్‌వర్క్‌లు ప్రపంచ శాంతికి పెనుముప్పుగా మారాయని మండలి ఆందోళన వ్యక్తం చేసింది.
