లాడెన్ కొడుకు హమ్జా బతికే ఉన్నడా..! వీడియో రిలీజ్ చేసిన ఆల్ ఖైదా

లాడెన్ కొడుకు హమ్జా బతికే ఉన్నడా..! వీడియో రిలీజ్ చేసిన ఆల్ ఖైదా

న్యూయార్క్: 9/11 దాడులకు 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా అల్‌‌ఖైదా సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఒసామా బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ ఇందులో కనిపించాడు. ఏడేండ్ల కిందటే హమ్జా చనిపోయాడని వార్తలు వచ్చినా.. అల్‌‌ఖైదా మాత్రం ఇప్పటివరకు ఆ విషయాన్ని ధ్రువీకరించలేదు. అల్‌‌ఖైదా మీడియా విభాగం అస్సహాబ్ శుక్రవారం ‘ఎ క్వార్టర్ సెంచరీ ఆఫ్ ది 11 సెప్టెంబర్ రైడ్స్’ పేరుతో 50 నిమిషాల వీడియోను రిలీజ్ చేసింది. 2014లో పాకిస్తాన్‌‌లోని కరాచీ నేవల్ డాక్‌‌యార్డ్‌‌పై జరిగిన దాడి దృశ్యాలతో వీడియో మొదలవుతుంది. ఇందులో హమ్జా పలుమార్లు కనిపించాడు. తెల్లటి తలపాగా పెట్టుకుని, గోడ ముందు కూర్చున్న అతడి పక్కన తుపాకీ ఉంది.