
హైదరాబాద్‌సిటీ, వెలుగు: సిటీలో ఉంటూ చదువుకుంటున్న స్టూడెంట్స్దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు వారున్న ప్రాంతం నుంచే బస్సులను నడపనున్నట్టు గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. చదివే కాలేజీలు, హాస్టళ్ల వద్దకే బస్సులు వచ్చి పికప్ చేసుకుంటాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, జగిత్యాల, గోదావరిఖని, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, పెద్దపల్లి, సూర్యాపేట, కోదాడ, కొత్తగూడెం, ఖమ్మం, ఆర్మూర్ లకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందన్నారు.
పటాన్చెరు, మియాపూర్, బైరంగూడ, కూకట్పల్లి, దుండిగల్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, బాలానగర్ప్రాంతాల వారు 9959226148 నంబర్‌కు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చన్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఏఎస్‌రావునగర్, రేతిఫైల్, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్ప్రాంతాల్లోని వారు 9959226142 నంబర్‌కు, దిల్సుఖ్నగర్, హయత్‌నగర్, ఎల్బీనగర, బడంగ్‌పేట, ఆదిబట్ల, మిథాని, కొల్లాపూర్, సరూర్నగర్ప్రాంతాల వారు 9959226136కు, మెహదీపట్నం, రాజేంద్రనగర్, అత్తాపూర్, చార్మినార్, కోఠి, కాచిగూడ, నారాయణగూడ ప్రాంతాల్లోని వారు 9959226129కి ఫోన్ చేసి బస్సులను బుక్ చేసుకోవచ్చన్నారు.