
హైదరాబాద్సిటీ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఈ నెల 15 నుంచి 26 వరకు జరగనున్న పవిత్ర సరస్వతీ నది పుష్కరాలకు గ్రేటర్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఈడీ రాజశేఖర్ తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను ప్రధాన పుష్కర ఘాట్లకు తీసుకెళ్లేలా ప్లాన్రూపొందిస్తున్నట్టు చెప్పారు.
జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, కూకట్ పల్లి, జీడిమెట్ల, మేడ్చల్బస్టాండ్ల నుంచి మెట్రో డీలక్స్బస్సులు నడపనున్నట్టు తెలిపారు. ప్రత్యేకంగా ఒక కాలనీ నుంచి 40 ప్రయాణీకులు ఉంటే నేరుగా ఆ కాలనీకే బస్సు పంపిస్తామన్నారు. ఈ బస్సుల వివరాల కోసం 96766 71533, 99592 26154, 99592 26160 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఆర్టీసీ వెబ్సైట్ద్వారా టికెట్లను బుక్చేసుకోవచ్చాన్నారు. బుధవారం నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.