క్యాసినో కింగ్ కు చీకోటి ప్రవీణ్ కు థాయ్‌లాండ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతోపాటు ఆరెస్ట్ అయిన 83 మంది భారతీయులకు కూడా థాయ్‌లాండ్ కోర్టు బెయిల్ ఇచ్చింది. రూ. 4500 బాట్స్ జరిమానాతో కోర్టు అందరికీ బెయిల్ ఇచ్చింది. జరిమానాను చెల్లించడంతో పోలీసులు వారికి పాస్ పోర్టులు కూడా ఇచ్చేశారు. దీంతో చీకోటి ప్రవీణ్ తో పాటుగా 83 మంది నేడు ఇండియాకు రానున్నారు.
ఓ కన్వెన్షన్ సెంటర్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన 91 మంది జూదం ఆడుతుండగా మే 1 సోమవారం తెల్లవారుజామున చౌనబురి ప్రావిన్స్ పోలీసులు దాడిచేశారు. 83 మంది భారతీయులతో పాటు 91 మందిని అరెస్టు చేశారు. ఈ ముఠాలో 14 మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను అరెస్ట్ చేసింది.
