గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో యుద్ద నౌక మునిగిపోయి 33మంది గల్లంతు

గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో యుద్ద నౌక మునిగిపోయి 33మంది గల్లంతు

గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో ఓ యుద్ద నౌక సముద్రంలో మునిగిపోయి, 33 మంది గల్లంతయ్యారు. తప్పిపోయిన మెరైన్ లను గుర్తించడానికి థాయ్‌లాండ్ సైన్యం యుద్ధనౌకలు, హెలికాప్టర్‌లను మోహరించినట్లు నావికాదళం తెలిపింది. హెచ్ టీఎంఎస్ సుఖోథాయ్ యుద్ధ నౌక ఇంజిన్ పనిచేయకపోవటంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగానే రాత్రి సమయంలో బ్యాంకాక్‌కు దక్షిణంగా ఉన్న ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం.

వాతావరణం అనుకూలించకపోవడంతో నౌకలో ఉన్న 106మందిలో 73మంది సురక్షితంగా ఉండగా, మరో 33మంది తప్పిపోయారు. నౌకాదళం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 1987 నుండి వాడుకలో ఉన్న యుఎస్-నిర్మిత కొర్వెట్ అయిన సుఖోథాయ్ ఆదివారం బలమైన అలల తాకిడికి గురైంది. సముద్రంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అది ఒక వైపుకు వంగిపోయిందని ప్రమాదం జరిగిందని నావికాదళ ప్రతినిధి అడ్మిరల్ పోగ్‌క్రాంగ్ మాంథార్డ్‌పలిన్ తెలిపారు.