థాయ్లాండ్ ప్రధానిగా థావిసిన్

థాయ్లాండ్   ప్రధానిగా థావిసిన్

బ్యాంకాక్: థాయ్లాండ్  ప్రధానిగా ఆ దేశ ప్రముఖ రియల్  ఎస్టేట్  దిగ్గజం శ్రెథ్థా థావిజిన్  ఎన్నికయ్యారు. ఆ దేశ పార్లమెంటుకు తాజాగా నిర్వహించిన ఓటింగ్ లో మాజీ ప్రధాని తక్సిన్  షినవత్రకు చెందిన ఫ్యూ థాయ్  పార్టీ నేతృత్వంలోని కూటమి గెలిచింది. మొత్తం 727 ఓట్లలో థాయ్  పార్టీ కూటమికి 482 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రధానిగా రియల్  ఎస్టేట్  దిగ్గజం థావిజిన్ ను ఎన్నుకున్నారు. 

రెండు మిలిటరీ అనుకూల పార్టీలతో పాటు మొత్తం 11 పార్టీల సంకీర్ణ కూటమికి థావిజిన్  నేతృత్వం వహించనున్నారు. మూవ్  ఫార్వర్డ్  పార్టీని కూటమి నుంచి తప్పించారు. ఎన్నికల్లో ఫ్యూయ్  థాయ్  పార్టీ నేతృత్వంలోని కూటమి మోసపూరితంగా గెలిచిందని మూవ్  ఫార్వర్డ్  పార్టీ ఆరోపించింది. 
కాగా, థాయ్​లాండ్​కు తిరిగివచ్చిన మాజీ ప్రధాని షినవత్ర కొన్ని గంటల్లోనే జైలుకు వెళ్లారు. అవినీతి కేసులో ఆయనకు 8 ఏళ్లు శిక్ష పడింది.