Thalapathy Vijay: చెన్నైలో ఓటు వేసిన హీరో విజయ్..చేతికి గాయం అయ్యిందా!

Thalapathy Vijay: చెన్నైలో ఓటు వేసిన హీరో విజయ్..చేతికి గాయం అయ్యిందా!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల నగరా షురూ అయింది.అందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది.తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాల్లో 102 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ నడుస్తోంది.అలాగే మరోవైపు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. 

శుక్రవారం ఏప్రిల్ 19న ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవ్వగా..తమిళనాడులో సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ,సినీ ప్రముఖులు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.అందులో భాగంగా స్టార్ హీరో..టీవీకే పార్టీ అధ్యక్షుడు తలపతి విజయ్ (Vijay) శుక్రవారం చెన్నైలోని నీలంకరైలోని వేల్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్‌లో ఓటు వేశారు.విజయ్ ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వచ్చినప్పుడు అభిమానులు అతనిపై గుంపులు గుంపులుగా రావడంతో పెద్ద ఎత్తున గొడవ జరిగింది.ఇక పోలింగ్ బూత్‌ లో తన ఓటును వినియోగించడానికి ఇంటి నుండి మొదలు పోలింగ్ బూతు వరకు భారీ బందోబస్తు మధ్యన విజయ్ తన ఓటును వేశారు.

అయితే, ఈ క్రమంలో విజయ్ ఎడమ చేతికి గాయం కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళనలో పడ్డారు. విజయ్ పిడికిలి వేళ్లపైనా బ్యాండేజ్ ఉండటం చూసిన తలపతి ఫ్యాన్స్..ఏమైంది అన్న?..ఈ గాయం సినిమా షూటింగ్ లో జరిగిందా? లేక అభిమానుల తాకిడి వల్ల  జరిగిందనే ప్రశ్నలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో నెటిజన్స్..'సినిమా కోసం భారీ యాక్షన్ సీన్స్ చేసేటపుడు కాస్తా జాగ్రత్త అన్న' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ నటిస్తున్న 'గోట్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక తన ఓటు వినియోగించుకోవడానికి రష్యా నుంచి ఈ రోజు ఉదయాన్నే భారతదేశంలో ల్యాండ్ అయ్యారు. విజయ్ తమిళనాడులో కొత్తగా పెట్టిన పార్టీ 'తమిళగ వెట్రి కజగం'..ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంది. 

రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్, విజయ్ సేతుపతి మరియు ధనుష్ వంటి ప్రముఖులు తమ ఓటు కర్తవ్యాన్ని నిర్వర్తించడం మరియు అభిమానులను అదే విధంగా చేయమని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.