లియో సెకండ్ సింగిల్‌ రిలీజ్..అనిరుధ్ ఎలక్ట్రిఫైయింగ్ సింగింగ్

 లియో సెకండ్ సింగిల్‌ రిలీజ్..అనిరుధ్ ఎలక్ట్రిఫైయింగ్ సింగింగ్

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో(Leo). స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విక్రమ్(Vikram) లాంటి బ్లాక్ బస్టర్ తరువాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడం..అలాగే విజయ్-లోకేష్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 

లేటెస్ట్గా లియో తమిళ రెండో సింగిల్‌(Badass)ని రిలీజ్ చేశారు మేకర్స్. అనిరుధ్ ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో సాంగ్ ఆకట్టుకుంది. బాదాస్ మా..లియో దాస్ మా..అంటూ అనిరుధ్(Anirudh) తన వాయిస్ తో పిచ్చెక్కించేసాడు. ప్రస్తుతం తమిళంలో సాంగ్ రిలీజ్ అవ్వగా..త్వరలో తెలుగు లిరికల్ కూడా రిలీజ్ కానుంది. ఈ సాంగ్కి విష్ణు లిరిక్స్ అందించగా..అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేసి పాడారు. ఈ సాంగ్ కూడా మరో బ్లాక్బాస్టర్ హిట్ ట్రాక్ లో నిలవటం కన్ఫర్మ్ అనిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ దిమ్మతిరిగేలా ఉన్నాయి. 

ఈ మూవీలో సంజయ్ దత్ విలన్గా నటిస్తుండగా..యాక్షన్ కింగ్ అర్జున్ హెరాల్డ్ దాస్ అనే కీ రోల్ చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన హెరాల్డ్ దాస్ గ్లింప్స్..తెరికే అంటూ సింగిల్ డైలాగ్ తో అర్జున్ బీభత్సం క్రియేట్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్న ఈ సినిమా..అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా త్రిష(Trisha) నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా..బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.