తమిళ హీరో విజయ్ కొత్త పార్టీ పేరు, జెండాపై కసరత్తు

తమిళ హీరో విజయ్ కొత్త పార్టీ  పేరు, జెండాపై కసరత్తు

చెన్నై: తమిళ హీరో విజయ్​ రాజకీయ పార్టీ పెట్టనున్నారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై ఎన్నాళ్ల నుంచో వార్తలు  వస్తున్నాయి. పార్టీ పెట్టడం ఖాయమని ప్రకటనలు చేస్తూ వచ్చిన విజయ్​.. ఆ దిశగా ఇప్పుడు ప్రాసెస్​ స్టార్ట్​ చేశారు. పార్టీ పేరు, రిజిస్టర్​ చేయించడంపై చర్చించేందుకు 200 మంది ముఖ్య నాయకులతో ఇటీవల ఆయన చెన్నైలో భేటీ అయ్యారు.

అందులో పార్టీ ప్రెసిడెంట్​గా విజయ్​ను ఎన్నుకున్నారు. పార్టీని రిజిస్టర్​ చేసిన వెంటనే విజయ్​ పొలిటికల్​ యాక్టివిటీని ప్రారంభిస్తారని మీటింగ్​లో పాల్గొన్న నేతలు చెప్పారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని, ఆలోపు పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తారన్నారు.