ఫ్లాప్ డైరెక్టర్ సినిమా కోసం 200 కోట్ల రెమ్యూనరేషన్

ఫ్లాప్ డైరెక్టర్ సినిమా కోసం 200 కోట్ల రెమ్యూనరేషన్

దళపతి విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఒక ఫ్లాప్ డైరెక్టర్ ని సెట్ చేసుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ కోసం విజయ్ ఏకంగా 200 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇంతకీ ఆ ఫ్లాప్ డైరెక్టర్ మరెవరో కాదు.. వెంకట్ ప్రభు. ఈ డైరెక్టర్ తాజాగా నాగ చైతన్య హీరోగా కస్టడీ అనే మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని చవిచూసింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. 

దీంతో ఈ డైరెక్టర్ సాలిడ్ కంబ్యాక్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. అందుకే తమిళ స్టార్ హీరో విజయ్ కోసం ఓ పవర్ఫుల్ కథని సిద్ధం చేసాడట. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం విజయ్ కి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ వస్తే.. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే యాక్టర్ గా విజయ్ రికార్డుల్లోకి ఎక్కుతాడు. 

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. వెంకట్ ప్రభు సినిమా మేకర్స్ 200 కోట్లు ఆఫర్ చేయడం అనేది ఇక్కడ విశేషం. కథలో నాథ దమ్ముందా? లేక కాంబినేషన్ కోసం ఇలా చేస్తున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.