ఇంటింటికీ తాగు నీరందించిన ఘనత కేసీఆర్​దే: తలసాని శ్రీనివాస్​ యాదవ్

ఇంటింటికీ తాగు నీరందించిన ఘనత కేసీఆర్​దే: తలసాని శ్రీనివాస్​ యాదవ్

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటింటికీ తాగు నీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఓ  ఫంక్షన్ హాల్ లో మెట్రో వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మంచినీళ్ల పండుగ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఇందులో వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, బెవరేజేస్ కార్పోరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తలసాని మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ సర్కార్​ రాకముందు ఊళ్లలో తాగునీటి సమస్యలు ఉండేవని ప్రస్తుతం అన్ని సమస్యలు తీరిపోయాయని వెల్లడించారు. హైదరాబాద్​లో రూ.13,546 కోట్ల తో మిషన్​ భగీరథ పథకం అమలు చేసినట్లు చెప్పారు. మురుగు నీటిని శుద్ధి చేసే అతి పెద్ద వ్యవస్థ తెలంగాణలోనే ఉందన్నారు. తండాలు, గూడెలల్లో నీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పడిందని చెప్పారు.